Nagarjuna: తెలంగాణ టూరిజంపై స్పెషల్ వీడియో విడుదల చేసిన నాగార్జున, ఇరానీ ఛాయ్.. కరాచీ బిస్కెట్.. హైదరాబాద్ బిర్యానీ అంటూ..
సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి
సినీ నటుడు నాగార్జున (Nagarjuna) ఎక్స్ వేదికగా తెలంగాణ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఓ వీడియోని విడుదల చేశారు. అందులో పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. వీడియోలో నాగార్జున మాట్లాడుతూ..అందరికీ నమస్కారం.. నేను మీ నాగార్జున. చిన్నప్పటి నుంచి తెలంగాణ మొత్తం తిరిగాను. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం అందంగా ఉంటాయి. ఇక ఆలయాల విషయానికొస్తే, వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం.
దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ప్రతి ఒక్కరూ చూడాలి. నిజంగా ఎంతో అందమైనదే కాదు, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. యాదగిరి గుట్ట చాలా సార్లు వెళ్లాను. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వర్ణించలేను. తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్ చికెన్.. స్నాక్స్ విషయానికొస్తే, సర్వపిండి చాలా ఇష్టం. ఇరానీ ఛాయ్, కరాచీ బిస్కెట్, హైదరాబాద్ బిర్యానీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోలేను. మీతో చెబుతుంటే నా నోరూరుతోంది. ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ రండి. తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించండి. మా తెలంగాణకు త్వరగా రండి. అని తెలిపారు. ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసిన తెలంగాణ టూరిజం.. నటుడు నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది.
Nagarjuna Released Video on Telangana Tourism
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)