Bombay High Court: మంచి భార్య కాకపోయినంత మాత్రాన.. మంచి తల్లి కూడా కాకుండా పోతుంది అని చెప్పలేం కదా.. పిల్లల అప్పగింతకు వివాహేతర సంబంధాన్ని ఓ కారణంగా తీసుకోలేం.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
వివాహేతర సంబంధం విడాకులు మంజూరు చేసేందుకు ఒక కారణంగా పరిగణించవచ్చేమోగానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.
Mumbai, Apr 20: వివాహేతర సంబంధం (Extra Marital Affair) విడాకులు (Divorce) మంజూరు చేసేందుకు ఒక కారణంగా పరిగణించవచ్చేమోగానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. ఈ మేరకు తొమ్మిదేండ్ల కూతురి సంరక్షణను తల్లికి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. భార్యకు వివాహేతర సంబంధం ఉన్నదని, కూతురి కస్టడీని ఆమెకు అప్పగించడం సరికాదన్న భర్త వాదనను ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. మంచి భార్య కాకపోయినందున, ఒక మంచి తల్లి కూడా కాకుండా పోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)