Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన దొంగ అరెస్ట్, చింతలూరు వద్ద బస్సు ఆపి అందులో నిద్రపోతున్న సమయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏపీలోని కాకినాడ జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా చూసి బస్టాండ్ లోని బస్ లో పడుకొని.. బస్ కు తాళం ఉండటం చూసి ఓ దుండగుడు బస్ ఎత్తుకెళ్లిన సంగతి విదితమే.తాజాగా చింతలూరు వద్ద బస్సు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని ఆ దొంగను అరెస్ట్ చేశారు.

Police Arrested Thief Who Theft APSRTC Bus (Photo-X)

ఏపీలోని కాకినాడ జిల్లా నర్సీపట్నంలో పుష్ప సినిమా చూసి బస్టాండ్ లోని బస్ లో పడుకొని.. బస్ కు తాళం ఉండటం చూసి ఓ దుండగుడు బస్ ఎత్తుకెళ్లిన సంగతి విదితమే.తాజాగా చింతలూరు వద్ద బస్సు ఉందని సమాచారం అందుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకొని ఆ దొంగను అరెస్ట్ చేశారు.నిందితుడిని తమిళనాడుకు చెందిన సాదిక్ గా గుర్తించారు.

వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న రైలు కింద పడిన నడి వయస్కుడు, అప్పటికప్పుడు తట్టిన సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకోవడంతో సేఫ్

దీనిపై నర్సీపట్నం టౌన్ ఐసీ గోవిందరావు స్పందిస్తూ గీతం రాజు అనే వ్యక్తి తుని, నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసీ బస్సు రాత్రి మిస్సయిందని కంప్లైట్ ఇచ్చాడని తెలిపారు. వెంటనే తుని, చింతపల్లి రూట్లో రెండు టీమ్స్ ఏర్పాటు చేసి చెక్ చేశాం. చింతపల్లి పరిధిలో బస్సు ఉందని సమాచారం రాగా, అక్కడి టీమ్‌ను అలర్ట్ చేయగా వెళ్లి బస్సును గుర్తించారు. నిందితుడు బస్సులోనే నిద్రపోతున్నట్లు పోలీసులు తెలిపారు.

Police Arrested Thief Who Theft APSRTC Bus 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement