Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియోలు ఇవిగో, రోడ్లు సరిగా లేకపోవడంతో డోలీలో నిండు గర్భిణిని, అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు.
మాడుగుల జాలంపల్లి పంచాయతీ శివారు సిరిపురం గ్రామానికి చెందిన చెదల వెంకటలక్ష్మికి బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాలంపల్లి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మాడుగుల సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. సుఖప్రసవం కావడంతో తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. మరో ఘటనలో అల్లూరి జిల్లా చింతపల్లిలో వర్షపు బురద రోడ్డులో డోలీలో గర్భిణీ లక్ష్మీని ఆసుపత్రికి తరలించగా, పాడేరు ప్రాంతంలో వృద్ధుడికి అనారోగ్యంతో డోలి కట్టి వాగు ప్రవాహం దాటించారు. అక్కడి నుంబి వారి కుటుంబీకులు వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.
Tribal People carried pregnant woman and Older Man in doli to Hospital
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)