Indian Army Using AI: సరిహద్దుల్లో ఏఐతో నిఘా.. భారత ఆర్మీ కీలక నిర్ణయం?!
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. శత్రువుల సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Newdelhi, Dec 10: సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత ఆర్మీ (Indian Army) కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. శత్రువుల (Enemy) సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ-AI) సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆర్మీ ఏఐ ఆధారిత దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను వినియోగించనున్నదని తెలిపాయి. ఈ కొత్త సాంకేతికత సరిహద్దుల వెంబడి శత్రు దేశాల సైన్యం మోహరించిన ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర యుద్ధ పరికరాల ఎలక్ట్రానిక్ పరమైన వివరాలను సేకరిస్తుందని, తద్వారా భవిష్యత్తులో మనం చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించుకోవడంలో సహకరిస్తుందని వివరించాయి. శాటిలైట్లు, రాడార్లు ఆధారంగా ఏఐ సాఫ్ట్‌వేర్ డాటా సేకరిస్తుందని పేర్కొన్నాయి.
Aadhaar Iris Scan: ఫింగర్ ప్రింట్స్ లేకున్నా ఐరిస్ తో ఆధార్ జారీ.. కేంద్రం శుభవార్త
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)