Kapil Sibal: చట్టం ప్రకారం రాహుల్ ఆటోమేటిక్ గా అనర్హతకు గురయినట్టే.. మోదీపై వ్యాఖ్యల కేసులో కపిల్ సిబాల్.. తీర్పుపై స్టే వస్తేనే ఎంపీగా కొనసాగుతారని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడంతో రాహుల్ ఆటోమేటిక్ గా అనర్హతకు గురయ్యారని మాజీ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ చెప్పారు.
Hyderabad, March 24: ప్రధాని నరేంద్ర మోదీపై (Narendra Modi) అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) గుజరాత్ లోని (Gujarat) కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ కు కోర్టు 30 రోజుల సమయాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ (Kapil Sibal) స్పందిస్తూ... కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడంతో ఆయన ఆటోమేటిక్ గా అనర్హతకు గురయ్యారని చెప్పారు. ఇదొక విచిత్రమైన పరిస్థితి అని అన్నారు. చట్టం ప్రకారం రాహుల్ అనర్హతకు గురయినట్టేనని తెలిపారు. కోర్టు తీర్పుపై స్టే వస్తేనే లోక్ సభ సభ్యుడిగా రాహుల్ కొనసాగుతారని కపిల్ సిబాల్ చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)