Newdelhi, March 24: బాలీవుడ్ దర్శకుడు (Bollywood Director) ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar) కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి పాప్యులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. పొటాసియం స్థాయులు క్రమంగా పడిపోవడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు.
Filmmaker #PradeepSarkar passed away at the age of 67. He was known for films like #Parineeta, #HelicopterEela and #Mardaani. We extend our condolences to his loved ones in this difficult time. pic.twitter.com/sc8gUuso04
— Filmfare (@filmfare) March 24, 2023
ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ దాదా మృతి తనను బాధించిందని పేర్కొన్నారు. తన సినీ కెరియర్ ఆయన సినిమాతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవగణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.