Airtel Denies Data Breach: డార్క్ వెబ్‌లో 50 వేల డాలర్లకు ఎయిర్‌టెల్ డేటా అమ్మకం, కంపెనీ స్పందన ఏంటంటే..

డార్క్ వెబ్‌లో 375 మిలియన్ల ఎయిర్‌టెల్ కస్టమర్ల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి, అయితే ఆ ఆరోపణను కంపెనీ తోసిపుచ్చింది.

airtel

డార్క్ వెబ్‌లో 375 మిలియన్ల ఎయిర్‌టెల్ కస్టమర్ల వివరాలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి, అయితే ఆ ఆరోపణను కంపెనీ తోసిపుచ్చింది.టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ తన భద్రతా వ్యవస్థను ఉల్లంఘించలేదని, టెలికాం ప్లేయర్‌కు చెందిన కస్టమర్ల పెద్ద డేటా లీక్ అయినట్లు నివేదికలు అన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది.  ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన

కాగా 375 మిలియన్ల ఎయిర్‌టెల్ కస్టమర్ల వివరాలు, వారి ఫోన్ నంబర్, ఇమెయిల్, చిరునామా మరియు ఆధార్ నంబర్‌లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని ధృవీకరించని నివేదికలు సూచించాయి. 'xenZen'గా గుర్తించబడిన హ్యాకర్ ఈ డేటాను 50 వేల డాలర్లకు డార్క్ వెబ్ ఫోరమ్‌లో అమ్మకానికి పెట్టినట్లు ఆ నివేదికలు తెలిపాయి.

Here's Airtel Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now