![](https://test1.latestly.com/uploads/images/2025/02/1-745697946.jpg?width=380&height=214)
Hyderabad, Feb 11: దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య (Vande Bharat Express) రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటమే ఇందుకు కారణం. కాగా వందేభారత్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేయడానికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లను పట్టాలెక్కేలా చేసింది. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. అయితే, ఈ రైళ్లలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు ప్రయాణికులను భయందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam)- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకున్న ఓ సంఘటన దీనికి అద్దం పట్టినట్టయింది. భద్రత గురించి ప్రయాణికుల్లో ఉన్న ఆందోళనను రెట్టింపు చేసినట్టయింది. విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ టాయ్ లెట్ లో ఓ ప్రయాణికులు సిగరెట్ తాగాడు. ఈ పొగ మొత్తం ఆ కోచ్‌లో అలముకుంది. సిగరెట్ పొగ ఘాటుతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మహిళలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు.
Here's Video:
విశాఖ హైదరాబాద్ వందే భారత్ రైలు టాయిలెట్ లో సిగరెట్ తాగిన వ్యక్తి, బోగీలో పొగలు.
టికెట్ కలెక్టర్ ను నిలదీసిన ప్రయాణికులు. నేనేమి చేస్తాను అంటూ టీసి ఎదురు ప్రశ్న! pic.twitter.com/D3eOUruIx6
— ChotaNews App (@ChotaNewsApp) February 10, 2025
టీసీకి చెప్పాక కూడా..
సిగరెట్ ఘటనను తోటి ప్రయాణికులు టికెట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. అయితే, టీసీకి పరిస్థితిని వివరించినా ఉపయోగం లేకుండా పోయిందన ప్రయాణికులు వాపోతున్నారు. సిగరెట్ పొగ ఘాటు వల్ల తాను కూడా ఇబ్బంది పడ్డానంటూ టీసీ ప్రయాణికులతో చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.