Dosa-Sambar : దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్.. 11 నెలల పాటు న్యాయపోరాటం చేసి గెలుపొందిన లాయర్.. రెస్టారెంట్ కు రూ.3500 జరిమానా విధించిన కోర్టు
ఇదో విచిత్రమైన వార్త. దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్ కు ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు.
Patna, July 14: ఇదో విచిత్రమైన వార్త. దోసెలో (Dosa) సాంబార్ (Sambar) ఇవ్వని రెస్టారెంట్ కు (Restaurant) ఓ లాయర్ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో (Court) కేసు వేసి మరీ భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్‌కు (Bihar) చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది రూ.140 పెట్టి ఓ స్పెషల్ మసాలా దోసె పార్శిల్ ఆర్డర్ ఇచ్చారు. కానీ, ఇంటికొచ్చిన పార్శిల్‌లో దోసె, చట్నీ తప్ప సాంబార్ జాడ కానరాలేదు. దీంతో, ఆయన వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. 11 నెలల పాటు న్యాయపోరాటం చేశారు. న్యాయస్థానం చివరకు రెస్టారెంట్ నిర్వాహకులదే తప్పని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఆ రెస్టారెంట్ పై ఏకంగా రూ.3500 జరిమానా విధించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)