School Benches as Fuel: బీహార్ లో మధ్యాహ్న భోజనానికి స్కూల్ బెంచీలే వంట చెరకు.. దర్యాప్తునకు విద్యాశాఖ ఆదేశం
బీహార్ లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్ గ్రేడెడ్ మిడిల్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది.
Patna, Jan 14: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Mid-Day Meal) వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే (School Benches) వంట చెరకుగా (Fuel) మార్చేశారు. బీహార్ లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్ గ్రేడెడ్ మిడిల్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్ చేశారని వంట మనిషి ఆరోపించారు. ఈ ఆరోపణలను సవిత ఖండించారు. బెంచీలను వంటచెరకుగా వాడుకోమని చెప్పింది తాను కాదని, స్కూలు ప్రిన్సిపాల్ అని ఆరోపించారు. ప్రిన్సిపాల్ మాత్రం దీనిని ‘మానవ తప్పిదం’గా కొట్టిపడేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)