Gujarat HC: కలెక్టర్, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారు.. గుజరాత్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. కారణం ఏంటి?
పోలీస్ హెల్ప్ లైన్ కోసం అధికారులు ప్రచారం చేసిన తీరుపై గుజరాత్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ లాంటి ఉన్నతాధికారులు తామేదో దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.
Newdelhi, Nov 4: పోలీస్ హెల్ప్ లైన్ (Police Helpline) కోసం అధికారులు ప్రచారం చేసిన తీరుపై గుజరాత్ హైకోర్టు (Gujarat HC) అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లు (District Collector), పోలీస్ కమిషనర్ లాంటి ఉన్నతాధికారులు తామేదో దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించింది. ప్రజల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ గురించి, దాని హెల్ప్ లైన్ గురించి సామన్యులకు అర్ధమయ్యేలా స్పష్టంగా తెలియజేయాలని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి మయీలతో కూడిన ధర్మాసనం పోలీస్ శాఖను ఆదేశించింది. పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించడం సామాన్యుడికి అంత సులభం కాదని, కమిషనర్ కార్యాలయం అందని స్థాయిలో ఉన్నదని సీజే వ్యాఖ్యానించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)