![](https://test1.latestly.com/uploads/images/2025/02/5-278502132.jpg?width=380&height=214)
Newdelhi, Feb 14: ఉన్నత చదువులు పూర్తిచేసి, ఉద్యోగం చేయగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కేవలం తన భర్త (Wife) నుంచి పోషణ భత్యాన్ని పొందాలన్న ఉద్దేశంతో భార్య ఖాళీగా ఉండటాన్ని ఒప్పుకోబోమని ఒరిస్సా హైకోర్టు (Orissa HC) చెప్పింది. సరైన, ఉన్నత స్థాయి విద్యార్హతలు ఉన్నప్పటికీ, భర్తపై పోషణ భత్యం భారం మోపాలనే ఉద్దేశంతో, ఏదైనా ఉద్యోగం లేదా పని చేయకుండా ఖాళీగా కూర్చునే భార్యను చట్టం మన్నించదని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. తమను తాము పోషించుకునే స్థితిలో లేని భార్యలకు ఉపశమనం కల్పించడమే సీఆర్‌పీసీ సెక్షన్ 125 లక్ష్యమని చెప్పింది. భార్యకు పోషణ భత్యం కింద నెలకు రూ.8,000 ఇవ్వాలని కుటుంబ న్యాయస్థానం ఆమె భర్తకు ఇచ్చిన ఆదేశాలను సవరించిన హైకోర్టు నెలకు రూ.5,000కు తగ్గించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కారులో చెలరేగిన మంటలు… డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఘటన (వీడియో)
అలా భరణం పొందొచ్చు
మొదటి భర్తతో చట్టబద్ధంగా విడాకులు తీసుకోకపోయినా రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు భార్యకు ఉంటుందని గత వారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోనందున రెండో భర్త నుంచి భరణం కోరే హక్కు సదరు భార్యకు ఉండదంటూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం భార్యకు అనుకూలంగా తీర్పు చెప్పింది.