
Hyderabad, Feb 14: వేసవి రాకముందే కారులో అగ్ని ప్రమాద ఘటనలు (Fire Accidents) పెరిగిపోతున్నాయి. సిటీలోనే మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో కారులో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి టిప్పఖాన్ బ్రిడ్జి సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో లంగర్ హౌజ్ నుంచి టిప్పాఖాన్ బ్రిడ్జి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే, కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Here's Video:
నడిరోడ్డుపై కారులో మంటలు
హైదరాబాద్-లంగర్ హౌజ్ ప్రాంతంలో ఘటన
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/4B7dg9zVpR
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2025
వారం కిందట కూడా
వారం రోజుల కిందట పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్, వరంగల్ రహదారిపై షార్ట్ సర్క్యూట్ తో ఓ కారు దగ్ధమైంది. ఇక, నెల రోజుల కిందట విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారులో చౌటుప్పల్ సమీపంలో వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో డ్రైవర్ తో పాటు అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును పక్కకు నిలిపేశాడు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!