UP Horror: ఉచితంగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిని చెప్పులతో చావగొట్టారు.. యూపీలోని లలిత్‌ పూర్ జిల్లాలో దారుణఘటన

ఉత్తరప్రదేశ్‌ లోని లలిత్‌పూర్ జిల్లాలో మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Credits: Twitter

Lucknow, Aug 13: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని లలిత్‌పూర్ జిల్లాలో (Lalitpur) మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ (Chicken) ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతోంది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వార్‌‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్‌పై తిరుగుతూ గ్రామాల్లో చికెన్ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో రెచ్చిపోయారు. అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడిచేశారు. వదిలేయాలని ప్రాధేయ పడుతున్నా కనకరం లేకుండా విచక్షణ రహితంగా దాడిచేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arshia Goswami: 8 ఏళ్ల బాలిక.. 62 కిలోలు ఎత్తి గిన్నిస్ రికార్డ్.. హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి విశేషం..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement