Mumbai Court: బ్రేకప్ తర్వాత ప్రియుడి ఆత్మహత్యకు లవర్ ను తప్పుబట్టలేం.. ముంబై కోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రియునికి ప్రియురాలు బ్రేకప్ చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది.
Mumbai, Mar 4: ప్రియునికి (Lover) ప్రియురాలు బ్రేకప్ (Breakup) చెప్పిన తర్వాత, మానసిక ఆవేదనతో ఆ ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ ప్రియురాలు అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పరిగణించలేమని ముంబై కోర్టు చెప్పింది. ఇదేసమయంలో ఇష్టానుసారం ప్రేమికులను మార్చడం నైతికంగా సరికాదని కోర్టు తెలిపింది. నితిన్ కేనీ, మనీషా చుడసమ ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల తర్వాత నితిన్ కు మనీషా బ్రేకప్ చెప్పింది. దీంతో నితిన్ ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. కేసు కోర్టుకు వచ్చింది. విచారించిన ధర్మాసనం.. ప్రియుడి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు వెల్లడి కావాలంటే, బాధితుడిని అందుకు పురిగొలిపినట్లు లేదా సలహా ఇచ్చినట్లు స్పష్టమవ్వాలని వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)