Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం.. గుండెపోటుతో భక్తురాలు మృతి
రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్‌లో నిల్చున్న మహిళ క్యూలైన్‌లోనే కుప్పకూలింది.
Vemulawada, June 6: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు (Devotee) గుండెపోటుతో (Heart Attack) మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్‌లో నిల్చున్న మహిళ క్యూలైన్‌లోనే కుప్పకూలింది. బాధితురాలు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. భర్త, కూతురితో కలిసి సోమవారం రాజన్న ఆలయానికి మృతురాలు వచ్చింది. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం చేసుకోవడం కుదర్లేదు. దీంతో రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించి.. తెల్లవారుజామున దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే లేచి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న మహిళ ఛాతిలో నొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలింది. అది చూసి కుటుంబసభ్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. గమనించిన ఆలయ సిబ్బంది, వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)