Hyderabad, June 6: రామాయణ (Ramayanam) పారాయణం, రామనామ స్మరణ ఎక్కడ జరిగినా చిరంజీవిగా పిలిచే ఆంజనేయుడు (Lord Hanuman) అక్కడికి వస్తాడని హిందువుల నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ (Adipurush) సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ప్రతీ థియేటర్ లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది. సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్ లో ఓ సీటును అమ్మకుండా ఉంచేస్తామంటూ ఆదిపురుష్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
#Adipurush team to dedicate 1 seat in every theatre to Lord Hanuman. Details insidehttps://t.co/puzFDLI8KK
— India Today Showbiz (@Showbiz_IT) June 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)