Nepal Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దులో భూకంపం వీడియోలు ఇవిగో, 53కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు
నేపాల్-టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది.
నేపాల్-టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈమేరకు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మరో 62 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేపాల్-టిబెట్ (Nepal-Tibet Border) సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో మంగళవారం ఉదయం 6.35 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తర్వాత టిబెట్ రీజియన్‌లో మరో రెండుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.
Nepal Earthquake Videos