Newdelhi, Jan 7: నేపాల్ (Nepal)-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. లుబుచేకు 93 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. చైనాలో భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూప్రకంపనలతో జనం భయాందోళనకు గురి అయ్యారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు. పలు భవనాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Here's Video:
#WATCH | Kathmandu | An earthquake with a magnitude of 7.1 on the Richter Scale hit 93 km North East of Lobuche, Nepal at 06:35:16 IST today: USGS Earthquakes pic.twitter.com/MnRKkH9wuR
— ANI (@ANI) January 7, 2025
ఇండియాలోనూ..
నేపాల్ లో సంభవించిన భూకంపంతో భారత్ లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి. బీహార్ లోని పాట్నాతో పాటు పలు జిల్లాల్లో ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.