Red Meat: మీరు మటన్ అతిగా తింటున్నారా?? అయితే డయాబెటిస్ బారినపడినట్లే!
రెడ్ మీట్ (మటన్, బీఫ్)ను అతిగా తింటే టైప్-2 డయాబెటిస్ బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
Newdelhi, Oct 20: రెడ్ మీట్ (Red Meat) (మటన్, బీఫ్)ను అతిగా తింటే టైప్-2 డయాబెటిస్ (Type-2 Diabetes) బారినపడతారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వారంలో రెండు సార్లు, అంతకంటే ఎక్కువగా రెడ్ మీట్ ను తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని కేంబ్రిడ్జ్ లోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 2,16,695 మంది ఆరోగ్య డాటాను విశ్లేషించిన పరిశోధకులు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.36 ఏండ్ల డాటాను విశ్లేషించిన పరిశోధకులు 22 వేల మందికి పైగా టైప్-2 డయాబెటిస్ బారినపడినట్టు గుర్తించారు. అతిగా రెడ్ మీట్ తినేవారు టైప్-2 డయాబెటిస్ బారినపడే ప్రమాదం 62 శాతం పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు.