Prachi Nigam Shuts Trolls: ‘చాణక్యుడినీ ఎగతాళి చేసిన సమాజం ఇది..’ తన రూపంపై విమర్శలు ఎక్కుపెట్టిన ట్రోలర్లకు యూపీ టెన్త్ టాపర్ ప్రాచీ నిగమ్ కౌంటర్

ముఖంపై అవాంఛిత రోమాలతో ఉన్న తన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో ఎగతాళి చేసిన ట్రోలర్లకు యూపీ టెన్త్ టాపర్ ప్రాచీ నిగమ్ ముఖం వాచిపోయేలా గట్టి కౌంటర్ ఇచ్చారు.

prachi nigam (Credits: X)

Newdelhi, Apr 28: ముఖంపై అవాంఛిత రోమాలతో ఉన్న తన రూపాన్ని చూసి సోషల్ మీడియాలో (Social Media) ఎగతాళి చేసిన ట్రోలర్లకు (Trollers) యూపీ టెన్త్ టాపర్ (UP SSC Topper) ప్రాచీ నిగమ్ (Prachi Nigam) ముఖం వాచిపోయేలా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతిమంగా లెక్కలోకి వచ్చేది మార్కులే కానీ ఆహార్యం కాదని వారి నోరు మూయించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. చాణక్యుడిని కూడా ఆయన ఆహార్యం చూసి కొందరు ఎగతాళి చేశారని, కానీ అలాంటి హేళనలు ఆయన్ను ఏమాత్రం ప్రభావితం చేయలేదన్నారు. సరిగ్గా అలాగే తనపై కూడా జరుగుతున్న ట్రోలింగ్ కూడా పెద్దగా బాధించలేదని, ఈ ట్రోలింగ్ ను తాను పట్టించుకోకపోవడమే దీనికి కారణమని తెలిపారు. ఇదే సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తులకు ప్రాచీ నిగమ్ కృతజ్ఞతలు తెలిపారు.

2024 భారతదేశం ఎన్నికలు: ‘కుతుబ్‌ మినార్‌’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్‌ భవనం.. ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement