Uttarkashi Tunnel: హమ్మయ్యా.. ఉత్తరకాశీ టన్నెల్‌ లో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమం.. బయటకు వచ్చిన ఫొటో ఇదిగో!

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ లోని కుంగిపోయిన సిల్క్‌ యారా టన్నెల్‌ లో చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Uttarkashi Tunnel Rescue (Credits: ANI)

Newdelhi, Nov 21: ఉత్తరాఖండ్ (Uttarakhand) ఉత్తరకాశీ (Uttarkashi) లోని కుంగిపోయిన సిల్క్‌ యారా టన్నెల్‌ (Tunnel) లో చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనిమిది రోజుల క్రితం 41 మంది కార్మికులు టన్నెల్‌ లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఆరు అడుగుల వెడల్పాటి పైపు‌లైన్ ద్వారా వారికి ఆహారం అందించారు. చిక్కుకుపోయిన కార్మికులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు టన్నెల్‌ లోకి ఓ కెమెరాను పంపిన అధికారులు దాని ద్వారా వీడియో తీశారు. కార్మికులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Special Trains Sabarimala: దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now