Special Trains Sabarimala: దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో!
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి డిసెంబర్ 8 వరకు సికింద్రాబాద్, నర్సాపూర్, కాచీగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు.
Sabarimala, Nov 21: శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) రద్దీని దృష్టిలో ఉంచుకొని వారి కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి డిసెంబర్ 8 వరకు సికింద్రాబాద్, నర్సాపూర్, కాచీగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు
- సికింద్రాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు– ఈ నెల 26, డిసెంబర్ 3 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 28, డిసెంబర్ 5 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి మరుసరి రోజు ఉదయం 8.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- నర్సాపూర్-కొట్టాయం స్పెషల్ ట్రైన్– ఈ నెల 26, డిసెంబర్ 3 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 27, డిసెంబర్ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.
- కాచిగూడ-కొల్లాం ప్రత్యేక రైలు– ఈ నెల 22, 29, డిసెంబర్ 6 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 24, డిసెంబర్ 1, 8 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి మరుసరి రోజు ఉదయం 10.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
- సికింద్రాబాద్-కొల్లాం ప్రత్యేక రైలు– ఈ నెల 24, డిసెంబర్ 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరి రెండో రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
In order to clear extra rush of Sabarimala pilgrims, SCR will run 22 special trains between various destinations.@NewIndianXpress@XpressHyderabad pic.twitter.com/T7gvyhbJZ6
— Bachanjeetsingh_TNIE (@Bachanjeet_TNIE) November 20, 2023
కాకినాడ నుంచి..
కాకినాడ టౌన్-కొట్టాయం స్పెషల్ ట్రైన్– ఈ నెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్ 2 తేదీల్లో రాత్రి 12.30 గంటలకు బయల్దేరి మరుసరి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడ చేరుతుంది.
(The above story first appeared on LatestLY on Nov 21, 2023 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

