Newdelhi, Nov 21: మణిపూర్ లో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కాంగ్ పోక్పీ (Kongpokpi) జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్‌బీ జవాన్ (IRB Jawan) సహా మరో పౌరుడు మృతిచెందారు. సోమవారం రాత్రి హరోథెలా, కోబ్షా గ్రామాల మధ్య ఘర్షణ చెలరేగడంతో (Ambush) ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (IRB) బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో (Gunfire) ఐఆర్‌బీ జవాన్, వారి వ్యాన్ నడుపుతున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వారిని హుటాహుటిన దవాఖానకు తరలించినప్పటికీ లాభం లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. మృతులను హెన్మిన్లెన్ వైఫే, తంగ్మిన్‌లున్ హాంగ్సింగ్‌గా గుర్తించామన్నారు. కాగా, కుకీ-జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని ఓ గిరిజన సంస్థ ప్రకటించింది. దీంతో జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో మెయిటీ, కుకీ కమ్మూనిటీల మధ్య రిజర్వేన్ల వివాదం ఈ ఏడాది మే 3న ప్రారంభమైంది. రెండు గిరిజన తెగల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటికవరకు సుమారు 200 మంది చనిపోయారు.
In another ambush in Manipur ( India)
A special forces jawan was killed along with his driver.https://t.co/WVNWSL32LT
— Serene 943 (@KhansVoter) November 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)