Viral Video: వలంటీరు ను చెప్పులు, చీపుర్లతో చితక్కొట్టారు.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో
వలంటీరు ను చెప్పులు, చీపుర్లతో చితక్కొట్టారు.. ఎందుకో తెలుసా? వైరల్ వీడియో
Gannavaram, Feb 26: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) గన్నవరంలో (Gannavaram) ఓ వలంటీరు (Volunteer) ను చెప్పులు, చీపుర్లతో చితక్కొట్టారు. గన్నవరంలో రాంబాబు గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా (Assistant) పనిచేస్తున్నాడు. అదే సచివాలయ పరిధిలో వలంటీరుగా పనిచేస్తున్న యువతికి మరో యువకుడితో వివాహం నిశ్చయమైంది. 22న పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్ళికి వెళ్లిన రాంబాబు.. పెళ్లి కూతురు, తాను ప్రేమించుకున్నామంటూ వరుడికి మాయమాటలు చెప్పాడు. దీంతో వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వధువు కుటుంబ సభ్యులు నిన్న పంచాయతీ కార్యాలయానికి వెళ్లి రాంబాబును పట్టుకుని చీపుర్లు, చెప్పులతో చితకబాదారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)