Dog Bite: కుక్క కరిచినా ఇంట్లో చెప్పని బాలుడు.. నెల రోజుల తర్వాత రేబిస్ తో మృతి.. ఘజియాబాద్ లో విషాదం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
Newdelhi, Sep 6: ఉత్తరప్రదేశ్ లోని (Uttar Pradesh) ఘజియాబాద్ లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు (Dog Bite) తన పేరెంట్స్ కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ (Rabies) వ్యాధితో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ (Ghaziabad) లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావాజ్ (14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం పొరుగింట్లో ఉన్న ఓ కుక్క షావాజ్ ను కరిచింది. భయంతో ఈ విషయాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. ఆహారం తినడం మానేశాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో షావాజ్‌ను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, తనను నెల రోజుల క్రితం ఓ కుక్క కరిచిందని తెలిపాడు. ఇక తీవ్ర అస్వస్థతకు గురైన షావాజ్‌ను అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా షావాజ్ ప్రాణాలు కోల్పోయాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)