Newdelhi, Oct 29: భారత సైన్యానికి (Indian Army) చెందిన శునకం ఫాంటమ్ (Phantom) వీరమరణం పొందింది. జమ్ముకశ్మీర్ లోని అఖ్నూర్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం ఎనిమిది గంటలపాటు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఆర్మీ కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో సైనికులు తమకు తెలియకుండానే ఉగ్రవాదులను సమీపిస్తున్నప్పుడు.. అది పసిగట్టిన ఫాంటమ్ హెచ్చరించింది. దీంతో ఉగ్రమూకలు కాల్పులకు దిగారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడింది.
Indian Army's dog Phantom sacrifices his life while fighting terrorists in Jammu and Kashmir
Read: https://t.co/NvG9yRxho0https://t.co/NvG9yRxho0
— WION (@WIONews) October 29, 2024
డాగ్ ఫాంటమ్ త్యాగానికి వందనం!
డాగ్ ఫాంటమ్ 25 మే 2020న జన్మించింది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినది. ఇది ప్రత్యేకంగా దాడి చేసే కుక్కగా ట్రైనింగ్ పొందింది. అది ఆగస్టు 12, 2022 న ఆర్మీలో చేరినట్లు సమాచారం. ''మన నిజమైన హీరో, ధైర్యవంతులైన ఇండియన్ ఆర్మీ డాగ్ ఫాంటమ్ త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము'' అని ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు అన్నారు.
కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒటి డీకొన్న 5 కార్లు