Dogs

Hyderabad, Feb 7: కుక్కల (Dogs) ద్వారా ఓ చిన్నారికి వైరస్ (Virus) సోకిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో చిన్నారిని హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 'బ్రూసెల్లా ఇథిపికల్' అనే వైరస్ చిన్నారికి సోకిందని, ఇది సామాన్యంగా కుక్కలకు వచ్చే వైరస్ అని వైద్యులు పేర్కొన్నారు.

హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!

ఎలా వస్తుందంటే?

కలుషితమైన చికెన్‌ వ్యర్థాలు, నీటిని తాగడం, పచ్చిమాంసం వ్యర్థాలు తినడం ద్వారా కుక్కలకు ఈ వైరస్ సోకుతుందని వైద్యులు తెలిపారు. ఆ వైరస్‌ సోకిన కుక్కలు తిరిగిన ప్రాంతంలో చిన్నారులు తిరిగితే లేదా ఆ వైరస్ వచ్చిన కుక్కల మధ్య ఆడుకోవడంతో   వైరస్‌ సోకే ప్రమాదం ఉందని వివరించారు. ఇలాగే చిన్నారి శ్రీమేథకు సైతం ఆ వైరస్ సోకి ఉంటుందని వారు వివరించారు.

నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??