Hyderabad, Oct 22: హైదరాబాద్ (Hyderabad) లోని చందానగర్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తెనాలికి చెందిన ఉదయ్ (23) అనే యువకుడు ఆర్‌సీ పురంలోని అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి అతడు చందానగర్ లోని వీవీప్రైడ్ అనే హోటల్ కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ మూడో అంతస్తుకు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క (Dog) ఉదయ్ వెంటపడింది. దాంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ కిటికీ దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆ కిటికీలోంచి అతడు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
చందానగర్ లో కుక్క తరమడంతో మూడవ అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడు మృతి.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివి ప్రైడ్ హోటల్లో ఘటన..
ఆలస్యంగా వెలుగులోకి....
కుటుంబ సభ్యులతో నగరానికి వచ్చి రామచంద్రపురం అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న తెనాలి కి చెందిన ఉదయ్(23).
ఆదివారం…
— Telangana Awaaz (@telanganaawaaz) October 22, 2024
ప్రమాదం బయటకు పొక్కనీయకుండా..
ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా హోటల్ సిబ్బంది జాగ్రత్తపడ్డారు. అయితే, ఉదయ్ మిత్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల