Hyderabad, Oct 22: సినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది. తెలుగు నటి అనన్య నాగళ్లకు (Ananya Nagalla) కూడా తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె హీరోయిన్ గా నటించిన కొత్త సినిమా ‘పొట్టేల్’ (Pottel) ఈవెంట్లో ఇలాంటి ఒక కాంట్రవర్సీనే చోటు చేసుకుంది. ‘పొట్టేల్’ (Pottel) సినిమా ఈవెంట్ లో భాగంగా మీడియాతో క్వశ్చన్ అవర్ నిర్వహించగా… అందులో ఓ లేడీ జర్నలిస్ట్ అనన్యకు ఓ ప్రశ్నను సంధించారు. ‘తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటేనే భయపడతారు, ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది. మరి మీకు ఇలాంటి అనుభవం ఎదురయిందా?’ అని డైరెక్ట్ గా ప్రశ్నించారు. దీనిపై అనన్య స్పందిస్తూ.. ‘ఎక్కడైనా పాజిటివ్ నెగిటివ్ అనేవి ఉంటాయి, ఇది 100% తప్పు. నటిగా నాకు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదురవలేదు’ అని అంతే సూటిగా తెలిపారు. అంతటితో ఆగని ఆ మహిళా జర్నలిస్ట్.. ‘కమిట్మెంట్ ను బట్టి పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది’ అని మరోమారు రెట్టించి అడగ్గా.. ‘నేను ఈ ఫీల్డ్ లోనే ఉన్నాను. మీరు విన్న మాటలు చెబుతున్నారు. కానీ ఇక్కడ అది లేదు’ అంటూ అనన్య గట్టిగానే బదులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
Here's Video:
'పొట్టేల్' ప్రెస్ మీట్ లో నటి అనన్యపై కాస్టింగ్ కౌచ్ సంధించిన ప్రశ్నలు అడిగిన మహిళా జర్నలిస్టు. pic.twitter.com/3ocHBLg174
— ChotaNews (@ChotaNewsTelugu) October 21, 2024
'పొట్టేల్' ప్రెస్ మీట్ లో నటి అనన్యపై కాస్టింగ్ కౌచ్ ప్రశ్నలు సంధించిన ఓ మహిళా జర్నలిస్టు
మహిళా జర్నలిస్టు ప్రశ్నతో ఇండస్ట్రీలో తలెత్తిన కాంట్రవర్సీ
దీనిపై తాజాగా జర్నలిస్టు సంఘానికి లేఖ రాసిన ఫిల్మ్ ఛాంబర్
ఇలాంటి జర్నలిస్టులపై చర్యలు తీసుకోరా? అంటూ యూనియన్… pic.twitter.com/wcW9GlMsFG
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2024
ఫిలిం ఛాంబర్ ఫైర్
పొట్టేల్ ప్రెస్ మీట్ లో అనన్య కు ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్నలపై వాటిని సంధించిన మహిళా జర్నలిస్ట్ పై ఫిలిం ఛాంబర్ మండిపడింది. ఇలాంటి జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ సంఘానికి లేఖ రాసింది. సదరు జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ విషయాలను ఎలా చెప్పగలిగిందని కూడా ప్రశ్నించారు. అలాంటిదేమైనా ఉంటే ఆధారాలతో సహా ఛాంబర్ కు సమర్పిస్తే రహస్యంగా విచారణ జరిపిస్తామని హామీ కూడా ఇచ్చారు.. అయితే ఒకవేళ ఆధారాలు లేకపోతే ఆ జర్నలిస్ట్ పై చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ డిమాండ్ చేసింది.