Newdelhi, Sep 6: చంద్రయాన్-3 (chandrayaan-3) మిషన్ కు సంబంధించి ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్న ఇస్రో (ISRO), తాజాగా చంద్రుడి (Moon) ఉపరితలం త్రీడీ (3D) అనాగ్లిఫ్ ఫొటోల్ని విడుదల చేసింది. మల్టీ వ్యూ ఇమేజ్ లను ఒకచోట చేర్చి మూడు కోణాల్లో(త్రీడైమెన్షన్) కనిపించేలా చేయటమే ‘అనాగ్లిఫ్’. విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో త్రీడీ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన నేవిగేషన్ కెమెరాలతో తీసిన ఫొటోలను ప్రత్యేక పద్ధతిలో క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఎక్స్(ట్విట్టర్)లో ఇస్రో సందేశాన్ని పోస్ట్ చేసింది. ఎరుపు, సియాన్ రంగు కళ్లద్దాలను వాడితే త్రీడీ ఇమేజ్‌లను మరింత స్పష్టంగా చూడగలమని ఇస్రో పేర్కొన్నది.
Chandrayaan-3: ISRO releases 3D 'anaglyph' images of moon's surface
Read @ANI Story | https://t.co/hKn25252Gm#ISRO #Chandrayaan_3 #VikramLander pic.twitter.com/BIGHgY6bCA
— ANI Digital (@ani_digital) September 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)