Sonu Sood: పేద అమ్మాయిపై సోనూ సూద్ పెద్ద మనసు, కాలేజ్‌కు వెళ్లేందుకు రెడీగా ఉండు. నీ చదువు ఆగదు అంటూ హామీ
నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో బనవనూరుకు చెందిన Madiga Devi Kumari అనే అమ్మాయి సోనూ సూద్‌ను సోషల్ మీడియా ద్వారా సాయం కోరింది.ఆమె బీఎస్‌సీ చదవాలనుకుంటుండగా.. ఆమె కుటుంబ ఆర్థికస్థితి అందుకు సహకరించడం లేదు. నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు. దొంగతనం చేసిన స్విగ్గీ డెలవరీ బాయ్ కు మద్దతుగా నిలిచిన సోనూసూద్, దొంగకు సపోర్ట్ చేస్తున్నావంటూ ఫైరవుతున్న నెటిజన్లు
దీంతో సోనూ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అంతకుముందు వర్షంలో తడుస్తున్న ఫ్యాన్స్‌ను అప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సోనూసూద్ ఫతేహ్’ (Fateh) సినిమాలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోనూసూద్ స్వీయ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Here's Sonu Sood Reply
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)