Accident in Hyderabad: రెప్పపాటులో ప్రమాదం.. యూటర్న్ తీసుకుంటుండగా బైక్ ను ఢీకొట్టిన కారు.. (సీసీటీవీ ఫుటేజీ)
రోడ్డు ప్రమాదాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాడారం ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ఓ తండ్రి, కుమార్తె కలిసి బైక్ పై వెళ్తున్నారు.
Hyderabad, Aug 27: రోడ్డు ప్రమాదాలు (Road Accidents) వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ (Medchal Police Station) పరిధిలోని యాడారం ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ఓ తండ్రి, కుమార్తె కలిసి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ యూటర్న్ తీసుకునే క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా దూసుకొచ్చి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతుళ్లకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)