Laddu Auction All Time Record: బండ్లగూడ జాగీర్ లో గణేశ్ లడ్డూ వేలం పాట ఆల్ టైం రికార్డు.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన లడ్డూ ధర

ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది.

Laddu Auction All Time Record (Credits: X)

Hyderabad, Sep 17: గణేశ్ లడ్డూ వేలాల్లో (Ganesh Laddu Auction) కొత్త రికార్డులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్​ (Hyderabad) బండ్లగూడ జాగీర్ ​లో గణేశ్​ లడ్డూ వేలం పాటలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాంతంలోని కీర్తి రిచ్ ​మండ్ ​విల్లాస్ ​లో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ఏకంగా రూ.1.87 కోట్లు పలికింది. గతేడాది ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో రూ.1.20 కోట్లకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి దానిని మించి ధర పలకడం విశేషం. ఈ ఏడాది అత్యధికంగా రూ.1.87 కోట్లకు దక్కించుకోవడంతో గతేడాది రికార్డు బ్రేక్​ అయినట్లయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కన్నులపండువగా ఖైరతాబాద్‌ మ‌హాగ‌ణ‌ప‌తి శోభాయాత్ర.. లైవ్ వీడియో కోసం క్లిక్ చెయ్యండి..!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)