Prof Sameer Khandekar: ఆడిటోరియంలో ప్రసంగిస్తూ కుప్పకూలి మరణించిన ఐఐటీ ప్రొఫెసర్.. గుండెపోటే కారణమని వెల్లడి
ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ. సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
Kanpur, Dec 24: ఐఐటీ కాన్సూర్ (IIT Kanpur) లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ. సమీర్ ఖండేకర్ (Prof Sameer Khandekar) అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి (Hospital) తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రసంగం మధ్యలో ఆయన ఛాతిలో నొప్పి రావడంతో కూలబడిపోయారు. నిమిషాల వ్యవధిలో అచేతనంగా మారిన ఆయన్ను సమీపంలోని కార్డియాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు తేలింది. ఆయన మరణానికి గుండెపోటే కారణమని డాక్టర్లు వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)