Newdelhi, Dec 24: అరేబియా సముద్రంలో (Arabian Sea) 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై (Commercial Ship) శనివారం డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. గుజరాత్ లోని పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ‘ఐసీజీఎస్ విక్రమ్’ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. సముద్ర గస్తీ విమానం ‘డోర్నియర్’ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో నౌకతో కమ్యూనికేషన్‌ను అనుసంధానించిందని తెలిపారు.
Prashanth Kishore Meets Chandrababu: చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..
Drone Strikes Ship With 20 Indians Off Gujarat, Coast Guard Makes Contact https://t.co/H3Kybgn8LE pic.twitter.com/US7VzsRTzw
— NDTV (@ndtv) December 23, 2023
ఇజ్రాయెల్ నౌక
దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్ట్ నుంచి క్రూడాయిల్ తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఈ నౌక ఇజ్రాయెల్ కు చెందినదిగా భావిస్తున్నారు.
Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇంట్లో బాత్ రూమ్ ఏ దిశలో ఉండాలో తెలుసా ...