Maha Kumbh Mela 2025: అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో
మహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు.
మహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో మహా కుంభమేళ ముగియనుంది.
ప్రపంచం నలుమూలల నుంచి త్రివేణి సంగమంకు భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తుండగా ఈ కుంభమేళాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది ఇస్రో (ISRO).
స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ మేళా ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించగా డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలు వెలిశాయి. ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ మేళ ప్రాంతం దర్శనమివ్వగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గామ మారాయి. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక
ISRO Releases Space View Images of Maha Kumbh Mela
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)