Japanese PM Tries Golgappe With PM Modi: వీడియో ఇదిగో, భారత్ పానీ పూరీకి ఫిదా అయిన జపాన్ ప్రధాని, ఇంకొకటి అంటూ అడిగీ మరీ ప్రధాని మోదీతో కలిసి లాగించిన ప్యుమియో కిషిదా

పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్‌లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్‌ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్‌గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది.

Japanese PM Tries Golgappe With PM Modi (Photo-Video Grab)

భారత ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని ప్యుమియో కిషిదా రాష్ట్రపతిభవన్‌ వెనక ఉన్న సెంట్రల్‌ రిడ్జ్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ పరిధిలోని బుద్ధ జయంతి పార్క్‌లో కొద్దిసేపు కలియతిరిగారు. గౌతమ బుద్ధుని 2,500వ జయంతిని పురస్కరించుకుని చాన్నాళ్ల క్రితం ఈ పార్క్‌ను అభివృద్ధిచేశారు. పార్క్‌లోని బుద్దుని ప్రతిమకు నేతలు నివాళులర్పించారు. బోధి వృక్షం మొక్కను కిషిదాకు మోదీ బహూకరించారు.

పార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్‌లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్‌ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్‌గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది. ఇదే కాకుండా వేయించిన మామిడికాయల గుజ్జు రసాన్ని, లస్సీ తాగారు. ఫ్రైడ్‌ ఇడ్లీ కూడా తిన్నారు. తర్వాత బెంచ్‌పై కబుర్లు చెప్పుకుంటూ చాయ్‌ తాగారు. ఈ పార్క్‌ను 1964 అక్టోబర్‌లో నాటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రారంభించారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement