Kerala High Court: భార్యకు వంట రాకపోతే విడాకులా?.. వివాహ రద్దుకు తిరస్కరించిన కేరళ హైకోర్టు
భార్యకు వంట రానంత మాత్రాన దానిని క్రూరత్వంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.
Newdelhi, Oct 20: భార్యకు వంట రానంత మాత్రాన దానిని క్రూరత్వంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు (Kerala High Court) స్పష్టం చేసింది. దీన్ని కారణంగా చూపుతూ విడాకులు (Divorce) మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తన భార్యకు (Wife) వంట చేయడం రాదని, తనకు భోజనం వండిపెట్టకుండా తనపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నందున విడాకులు మంజూరు చేయాలంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కేరళ హైకోర్టు విచారించింది. చట్టపరంగా దంపతులైన తర్వాత అందులో ఒకరు వివాహాన్ని రద్దు చేసుకోవడానికి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని, విడాకులు కోరడానికి గల సహేతుకమైన కారణాన్ని చూపాలని ధర్మాసనం పేర్కొంది. ‘వంట చేయడం రాకపోతే అది క్రూరత్వం ఎలా అవుతుందని’ ధర్మాసనం ప్రశ్నించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)