Lamborghini Car Catches Fire: వీడియో ఇదిగో, ముంబై నడిరోడ్డు మీద మంటల్లో కాలిపోయిన ల‌గ్జరీ బ్రాండ్ కారు లంబోర్గినీ, కదులుతున్న కారులో ఒక్క‌సారిగా ఎగసిన మంటలు

ముంబ‌యిలోని కోస్టల్ రోడ్‌లో బుధవారం రాత్రి కదులుతున్న లంబోర్గినీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. వెంటనే ఒక ఫైరింజ‌న్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ‌ అధికారి ఒక‌రు తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో మంటలను ఆర్పివేసిన‌ట్లు పేర్కొన్నారు.

Lamborghini Huracan Supercar Catches Fire (photo/X/@SinghaniaGautam)

ముంబ‌యిలోని కోస్టల్ రోడ్‌లో బుధవారం రాత్రి కదులుతున్న లంబోర్గినీ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. వెంటనే ఒక ఫైరింజ‌న్‌ను సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ‌ అధికారి ఒక‌రు తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో మంటలను ఆర్పివేసిన‌ట్లు పేర్కొన్నారు. ఇక ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఉన్న వారి వివ‌రాలు, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై కచ్చితమైన సమాచారం లేద‌న్నారు.కాగా, ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోను వ్యాపార‌ దిగ్గజం, రేమండ్ గ్రూప్ అధినేత‌ గౌతమ్ సింఘానియా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇలాంటి సంఘటనలు లంబోర్గినీపై విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తాయ‌ని అన్నారు. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

వీడియో ఇదిగో, ముంబై జోగేశ్వరి వంతెనపై కారులో ఒక్కసారిగా మంటలు, నిమిషాల్లోనే కారు దగ్ధం

Lamborghini Huracan Supercar Catches Fire

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement