Little Boy Chews Snake: ఆడుకుంటూ పామును కొరికి చంపిన బాలుడు.. ఉత్తరప్రదేశ్‌లో ఘటన.. మరి బాలుడి పరిస్థితి ఏంటి?

ఇదో షాకింగ్ ఘటన. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ మూడేళ్ల బాలుడు పాము అని తెలియక దాన్ని చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌ జిల్లాలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.

Representational image of snakes | (Photo Credits: PTI)

Lucknow, June 5: ఇదో షాకింగ్ ఘటన. ఇంటి బయట ఆడుకుంటున్న ఓ మూడేళ్ల బాలుడు పాము (Snake) అని తెలియక దాన్ని చేత్తో పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) ఫరూఖాబాద్‌ (Farrukhabad) జిల్లాలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్‌సింగ్ మూడేళ్ల కుమారుడు శనివారం ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అతడి వైపుగా వచ్చింది. దానిని ఒడుపుగా పట్టుకున్న బాలుడు నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంట చనిపోయిన పామును కూడా పట్టుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Bihar Bridge Collapse Video: వీడియో ఇదిగో, రూ.1,710 కోట్లు గంగా నదిలోకి, బాగల్‌పురాలో రెండో సారి కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now