Madhya Pradesh: చీకట్లో వధువు చెల్లికి తాళి కట్టేసిన వరుడు, కరెంట్ వచ్చాక చూసి బిత్తరపోయిన వధువు తల్లిదండ్రులు, మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయం
ముహూర్తం దాటిపోతుందని పండితులు ఆ చీకట్లోనే పెండ్లి తంతు నిర్వహించారు. తర్వాత రెండు జంటలు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. అక్కడ వధువు ముసుగును తొలిగించిన పెండ్లి కొడుకు షాక్ అయ్యాడు. చెల్లి స్థానంలో అక్క ఉంది.
మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పెళ్లికొడుకు పెళ్లికూతురు బదులు వధువు చెల్లికి తాళి కట్టేశాడు.. ఘటన వివరాల్లోకెళితే.. ఉజ్జయినికి చెందిన రమేశ్ లాల్‌కు ఇద్దరు కూతుర్లు. పేర్లు నిఖిత, కరిష్మా. ఇద్దరికీ పెండ్లి నిశ్చయమైంది. ఒకే ముహూర్తంలో వివాహం. అక్కాచెల్లెల్లిద్దరూ ఒకే రకమైన పెండ్లి దుస్తులు కొనుక్కొన్నారు. ముఖానికి మేని ముసుగు తొడుక్కొన్న ఇద్దరు నవ వధువులను పెద్దవాళ్లు పెండ్లి మంటపంలోకి తీసుకువచ్చారు. ఇంతలో కరెంటు పోయింది. ఎంతకీ రాలేదు.
ముహూర్తం దాటిపోతుందని పండితులు ఆ చీకట్లోనే పెండ్లి తంతు నిర్వహించారు. తర్వాత రెండు జంటలు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. అక్కడ వధువు ముసుగును తొలిగించిన పెండ్లి కొడుకు షాక్ అయ్యాడు. చెల్లి స్థానంలో అక్క ఉంది. చీకట్లో పెండ్లి కుమార్తెలిద్దరూ తారుమారయ్యారు. దుస్తులు కూడా ఒకే రకంగా ఉండటంతో ఎవరూ గుర్తుపట్టలేదు. రెండు జంటలకు మళ్లీ పెండ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)