Madhya Pradesh Shocker: సాయిబాబా పాదాలు మొక్కుతూ గుండెపోటుతో భక్తుడు మృతి.. వీడియో..
మధ్యప్రదేశ్ కట్నీలోని పహరువా మండి రోడ్డు వద్ద ఉన్న సాయి బాబా ఆలయంలో ఓ విషాదకర ఘటన జరిగింది. రాకేశ్ మెహానీ అనే వ్యక్తి బాబా గుడిలో దేవుడి పాదాలు మొక్కుతూ మృతి చెందాడు.
Bhopal, Dec 4: సాయి బాబా (Sai Baba) గుడిలో (Temple) దేవుడి పాదాలు మొక్కుతూ గుండెపోటుతో (Heart Stroke) ఓ భక్తుడు మరణించిన ఘటన మధ్యప్రదేశ్ (Madhyapradesh) కట్నీలోని పహరువా మండి రోడ్డులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాకేశ్ మెహానీ అనే వ్యక్తికి సాయినాథుడంటే చాలా భక్తి. ఆయన ప్రతి గురువారం బాబా దర్శనం నిమిత్తం గుడికి వెళ్తుండేవాడు. అయితే ఎప్పటిలాగానే డిసెంబరు 1వ తేదీన కూడా సాయిబాబా గుడికి వెళ్లాడు. అక్కడ బాబా పాదాలకు మొక్కుతూ అలానే ఉండిపోయాడు. అదే సమయంలో గుడిలో ఉన్న భక్తులకు అనుమానం వచ్చి చూస్తే ఆయన మరణించిన విషయం తెలిసింది. అయితే ఆయన గుండెపోటుతో మరణించాడని సంబంధీకులు తెలిపారు.
ఈ ఏటీఎంలో డబ్బులు కాదు బంగారం వస్తుంది.. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం మన హైదరాబాద్ లోనే..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)