Credits: Facebook

Hyderabad, Dec 4: దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను (First Gold ATM In Country) హైదరాబాద్‌ (Hyderabad) బేగంపేటలో ఏర్పాటుచేశారు. డెబిట్‌ (Debit), క్రెడిట్‌ (Credit) కార్డులతో మనకు కావాల్సిన గోల్డ్ ను (Gold) ఈ ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌ లోని గోల్డ్‌ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ గోల్డ్ ఏటీఎంను ఏర్పాటుచేశారు.

‘బ్యాక్ టు వర్క్’.. మళ్లీ పనిలో అడుగుపెట్టిన మహేశ్ బాబు.. ఇటీవల తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత.. విరామం తీసుకున్న మహేశ్.. లేటెస్ట్ పిక్ తో ట్వీట్ చేసిన పోకిరి

ఈ ఏటీఎం ద్వారా శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ వెల్లడించారు. గోల్డ్ నాణేలతో పాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పేపర్స్ కూడా జారీ అవుతాయని పేర్కొన్నారు. ఈ ఏటీఎంను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి ప్రారంభించారు.