Maharashtra Rains: షాకింగ్ వీడియో ఇదిగో, భారీ వర్షాలకు రాయ్‌ఘడ్ కోటలో చిక్కుకున్న 30 మంది యాత్రికులు, వరద ప్రవాహానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

తాజాగా రాయ్‌ఘడ్ కోట నుండి ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లడంతో పాటు చారిత్రక ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి

Heavy Rainfall Grips tourists at Raigad Fort, horrific video goes viral in Social Media

మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తాజాగా రాయ్‌ఘడ్ కోట నుండి ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లడంతో పాటు చారిత్రక ప్రదేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు రాయ్‌ఘడ్ కోటలో ప్రవాహం పోటెత్తడంతో 30 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు. కోట యొక్క ప్రధాన ద్వారం వద్ద నీరు ఉధృతంగా ప్రవహించడంతో యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోడల మీదకు చేరుకున్నారు. అదృష్టవశాత్తూ, రెస్క్యూ ఆపరేషన్లు వేగంగా నిర్వహించబడ్డాయి, ఒంటరిగా ఉన్న వ్యక్తులందరినీ సురక్షితంగా తరలించేలా చూసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.  ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు వానలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Raigad Road Accident: రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తా పడిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, 5 మంది మృతి, 27 మందికి గాయాలు

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif