Makar Sankranti 2025: వీడియో ఇదిగో, పోటీ ఇవ్వకుండానే కోడీ పందెంలో ఓడిపోయిన రత్తయ్య కోడి పుంజు, రెప్పపాటులో రూ. 20 లక్షలు హుష్ కాకి
అయితే ఈ ఏడాది కూడా రత్తయ్య పుంజు బరిలోకి దిగింది. రెప్పపాటులో 20లక్షలు హుష్ కాకి అయ్యాయి. పోటీ ఇవ్వకుండానే రత్తయ్య పుంజు కుప్పకూలింది. తాజాగా జరిగిన కోడీ పందెంలో ఓడిపోయింది రత్తయ్య కోడి. కనీస పోటీ ఇవ్వకుండానే కిందపడిపోయిన కోడి..ఈ కోడి పందెం ద్వారా దాదాపు రూ. 20 లక్షలు చేతులు మారాయి.
ఏలూరు జిల్లా లోని పందెం పుంజులకు మంచి గిరాకీ ఉంది.ఇక్కడ కోడి పుంజులను కొనేందుకు పందెం రాయుళ్లు ఎగబడతారు.అందునా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో రత్తయ్య అనే యజమాని పెంచే పుంజులకు మరింత గిరాకీ ఉంటుంది. ఈయన దగ్గర కోడి పుంజులను కొనేందుకు గతంలో థాయ్ ల్యాండ్ నుండి పందెం రాయుళ్లు ప్రత్యేకించి వచ్చారంటే ఈయన గారి కోడి పుంజులకు అంతర్జాతీతీయ స్థాయిలో డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023లో గణపవరం లో 27 లక్షలకు పందెం జరగగా అ పందెంలో రత్తయ్య సిద్దం చేసిన పుంజు పందెం ని గెలిచింది. ఆ పుంజుతో పాటు మరొక పుంజును థాయిలాండ్ వాసులు రూ. 3 లక్షలకు కొనుకున్నారు కూడా.
అయితే ఈ ఏడాది కూడా రత్తయ్య పుంజు బరిలోకి దిగింది. రెప్పపాటులో 20లక్షలు హుష్ కాకి అయ్యాయి. పోటీ ఇవ్వకుండానే రత్తయ్య పుంజు కుప్పకూలింది. తాజాగా జరిగిన కోడీ పందెంలో ఓడిపోయింది రత్తయ్య కోడి. కనీస పోటీ ఇవ్వకుండానే కిందపడిపోయిన కోడి..ఈ కోడి పందెం ద్వారా దాదాపు రూ. 20 లక్షలు చేతులు మారాయి.
కోడీ పందెంలో ఓడిపోయిన రత్తయ్య కోడి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)