కర్నాటకలోని మాండ్యలోని హోసహళ్లిలో మకర సంక్రాంతి వేడుకల సందర్భంగా ఓ ఎద్దు ముగ్గురు వ్యక్తులను నేలకూల్చిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మకరసంక్రాంతి రోజు సాయంత్రం ఆవులు, ఎద్దులను మండే అగ్నిగుండంపైకి పంపించే సంప్రదాయ ఆచారంలో భాగంగా ఈ సంఘటన జరిగింది. వార్తా సంస్థ IANS భాగస్వామ్యం చేసిన వీడియోలో, ఒక ఎద్దు, మంటలను దాటిన తర్వాత, అదుపు చేయలేక మనుషులపై దాడి చేసింది.

 కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం.. మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు..వృద్దుడు సజీవ దహనం, వీడియో

ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వారు తీవ్ర గాయాలతో అస్పత్రిలో చేరారు. ఎద్దు యజమాని దానిని నియంత్రించేందుకు శత విధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎద్దును అదుపు చేయలేకపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. అది పరిగెత్తుతూ మనుషుల మీదకు వెళ్లడంతో పెను విషాద ప్రమాదానికి దారితీసింది.

 Bull Knocks 3 Men to Ground During Race Over Fire in Karnataka's Mandya

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)