Viral Video: తప్పిపోయిన బిడ్డ కనిపించగానే కోపంతో చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి.. ఇంటర్నెట్ ను మరోసారి షేక్ చేస్తున్న హృద్యమైన వీడియో ఇదిగో
తల్లి మనసు తల్లి మనసే. అదే జీవి అయితే ఏమిటి? కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లఢిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం.
Hyderabad, Sep 30: తల్లి మనసు తల్లి మనసే. అదే జీవి అయితే ఏమిటి? కన్న బిడ్డ కాసేపు కనబడకపోతే మనిషే కాదు.. పిల్లి, కుక్క, ఆవు, బర్రె, మేక, కోడి, ఎలుక ఇలా ఏ జీవి అయినా తల్లఢిల్లిపోతుంది. అందుకు సంబంధించి మనం ఎన్నో ఘటనలు చూసి ఉంటాం. అలాంటిదే ఘటనే ఇది. కనిపించకుండా పోయిన తన బిడ్డ కోసం ఓ తల్లి పిల్లి (Mother Cat) అంతటా వెతికింది. చివరికి ఓ ఇంటి వెనకాల తన పిల్ల కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక కాసేపు ఆగింది. ఆ తర్వాత పిల్ల దగ్గరికి వెళ్లి చెంపపై లాగి ఒక్కటిచ్చింది. ఆ వెంటనే పిల్లను నోట కరుచుకుని తన స్థావరానికి ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Video) గతంలో ఓసారి బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతోపాటు పలువురు నెటిజన్‌లు ట్విటర్‌లో ఉన్న ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)