Viral Video: సింహం నోట్లో ఆవు తల.. ధైర్యంగా ముందుకెళ్లి రక్షించిన రైతు.. రాయి పట్టుకుని ధైర్యంగా అదిలించడంతో సింహం పరార్.. గుజరాత్‌లో ఘటన.. వీడియో ఇదిగో!

ఎదురుగా కనిపించిన ఆవును ఓ సింహం నోటకరుచుకుంది. దాని తలను గట్టిగా పట్టుకుని చంపేందుకు యత్నించింది. అది చూసిన రైతు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురెళ్లి గోవును రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Credits: Twitter

Newdelhi, July 1: ఎదురుగా కనిపించిన ఆవును (Cow) ఓ సింహం (Lion) నోటకరుచుకుంది. దాని తలను (Head) గట్టిగా పట్టుకుని చంపేందుకు యత్నించింది. అది చూసిన రైతు (Farmer) ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎదురెళ్లి గోవును రక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Socialmedia) వైరల్ (Viral) అవుతోంది. గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లా అలీదార్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ సింహం గోవు మెడపట్టుకుని చంపేందుకు ప్రయత్నించింది. బాధతో విలవిల్లాడుతున్న ఆవు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ పెనుగులాడుతోంది. దాని అరుపులు విన్న రైతు అక్కడికొచ్చి సింహాన్ని చూశాడు. సింహం బారి నుంచి తన గోవును కాపాడేందుకు చెయ్యెత్తి గట్టిగా అరుస్తూ సింహాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కింద ఏమైనా దొరకుతుందేమోనని చూసి ఓ రాయిని తీసుకుని సింహాన్ని అదిలిస్తూ వెళ్లాడు. దీంతో భయపడిన సింహం ఆవును వదిలేసి పరారైంది.

Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now